Bapatla: బాపట్ల జిల్లా జడ్పీ చైర్మన్‌గా పూషడపు రోహిణి విజయం!

Bapatla: బాపట్ల జిల్లా జడ్పీ చైర్మన్‌గా 17,500 ఓట్ల బంపర్ మెజార్టీతో పూషడపు రోహిణి విజయం. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆశీస్సులతో విజయం, రోహిణి ప్రకటన.

Bakka Deepak, Bapatla
Published on: 8 Nov 2026 8:27 AM IST
Bapatla
X

Bapatla: బాపట్ల జిల్లా జడ్పీ చైర్మన్‌గా పూషడపు రోహిణి విజయం!

Bapatla: స్థానిక సంస్థల ఎన్నికల లో బాపట్ల జిల్లా తరఫున కూటమిలో భాగంగా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం కు చెందిన పూషడపు రోహిణి కుమారస్వామి 17,500 బంపర్ మెజారిటీ తో జిల్లా జడ్పీ చైర్మన్ పదవి కైవసం చేసుకుంది. పూషడపు కుమారస్వామి దాదాపు 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఆయనకు ఉంది.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు నమ్మిన బంటుల కుమారస్వామి 13 సంవత్సరాలు పనిచేశారు ఆయన కష్టానికి నేడు ఫలితం దక్కింది. రాజకీయ వ్యూహాలకు ఎత్తుకు పై ఎత్తుగడలేస్తూ ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళుతున్న రెవెన్యూ మినిస్టర్ కు అత్యంత ఆప్తుడుగా నిలిచిన వ్యక్తి కుమారస్వామి. జడ్పీ చైర్మన్ రేసు లో వైసీపీ నుండి శ్వేతా రెడ్డి అనే మహిళ పూషడపు రోహిణి పై పోటీ చేసి పరాజయం అయింది.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ పూషడపు రోహిణి కుమార్ స్వామి మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ముందుకు వెళ్తామని అన్నారు. జిల్లాని తనదైన శైలిలో పని చేస్తూ ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని కలుపుకొని మోడల్ బాపట్ల జిల్లాగా తీర్చిదిద్దెందుకు కష్ట పడతానని తెలియజేశారు. ఇంతటి అవకాశం తనకు ఇచ్చినందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి పూషడపు రోహిణి కుమారస్వామి ప్రత్యేక కృతజ్ఞతలు హెచ్ఎంటివి ద్వారా తెలియజేశారు.

Bakka Deepak, Bapatla

Bakka Deepak, Bapatla