Bapatla: బాపట్లలో 30 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం.. ఆటో డ్రైవర్ అరెస్ట్!
Bapatla: బాపట్ల జిల్లా కేంద్రంలో పౌరసరఫరాల శాఖ అధికారులు భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Bapatla: బాపట్లలో 30 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం.. ఆటో డ్రైవర్ అరెస్ట్!
Bapatla: బాపట్ల పట్టణంలోని రైలుపేట వద్ద జమేదర్ పేట దగ్గరలో ఈరోజు తెల్లవారుజామున డిఎస్ఓ జగన్మోహన్రావు ఆధ్వర్యంలో డీటీ ఫణి కుమార్ సారధ్యంలో కాకుమాను నుంచి బాపట్ల వైపు వస్తున్న టాటా మ్యాజిక్ ఆటో పట్టుకోగా దాంట్లో 30 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు వారు తెలిపారు.
డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ అప్పజెప్పి కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. అయితే ఆ డ్రైవర్ ఈ రేషన్ బియ్యం ఎక్కడకి తరలిస్తున్నారు అని అడగ్గా సుధాకర్ రైస్ మిల్క్ అని చెప్పగానే అధికారులు బృందం ఆ రైస్ మిల్లు పై దాడి చేసి విస్తృత తనిఖీలు చేశారు.
అనంతరం డీఎస్ఓ తో మాట్లాడుతూ అతని తప్పుడు సమాచారం చెప్పాడని ఈ రైస్ మిల్లులో ఎటువంటి రేషన్ బియ్యం లేవని ధృవీకరించారు.
Next Story




