Bapatla: రేపల్లె మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఏర్పాట్లు పూర్తి!
Bapatla: బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. 36 వార్డులు, 48 పోలింగ్ కేంద్రాలు. 400 మంది పోలీసులతో పటిష్ట భద్రత, డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరిక.
Bapatla: రేపల్లె మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఏర్పాట్లు పూర్తి!
Bapatla: రేపల్లె మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రేపల్లె పట్టణంలోని ఏబీఆర్ డిగ్రీ కళాశాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బంది. ఏబీఆర్ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ.
రేపల్లె మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులకు జరగనున్న ఎన్నికలు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 48 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. రేపల్లె మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 37,008 మంది. పురుష ఓటర్లు 17,483 మంది.. మహిళా ఓటర్లు 19,521 మంది. ఇతర ఓటర్లు నలుగురు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే 2,038 మంది అధికం.
ఎన్నికల విధుల నిర్వహణకు 300 మంది పోలీసులతో ఇప్పటికే బందోబస్తు. అదనంగా ఈరోజు సాయంత్రం రేపల్లెకు చేరుకోనున్న మరో 100 మంది ప్రత్యేక పోలీసు బలగాలు. మొత్తం 400 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక పోలీసు నిఘా.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారుల పిలుపు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్.




