Bapatla: మార్టూరులో ఘనంగా ప్రత్యేక పీజీఆర్ఎస్ కలెక్టర్ వినోద్ కుమార్

Bapatla: బాపట్ల జిల్లా మార్టూరులో ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించిన కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 18 Sept 2026 11:40 PM IST
Bapatla
X

Bapatla: మార్టూరులో ఘనంగా ప్రత్యేక పీజీఆర్ఎస్ కలెక్టర్ వినోద్ కుమార్

బాపట్ల: బాపట్ల జిల్లా మార్టూరు తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక పీజీఆర్ఎస్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ నిర్వహించారు.

కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి అర్జీలు సమర్పించారు.

భూ సమస్యలు, రెవెన్యూ, సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.

ప్రజలు అందించిన ప్రతి అర్జీని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. తమ సమస్యలు నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala