Bapatla: కుంకులమర్రులో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు భూమిపూజ ఎమ్మెల్యే!
Bapatla: పర్చూరు నియోజకవర్గం కుంకులమర్రు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు భూమిపూజ. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషితో గ్రామీణ వైద్య రంగానికి కొత్త ఊపిరి.
Bapatla: కుంకులమర్రులో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు భూమిపూజ ఎమ్మెల్యే!
Bapatla: కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పర్చూరు నియోజకవర్గంలోని కుంకులమర్రు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమాన్ని నాయకులు, అధికారులు నిర్వహించారు.
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషితో గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. భూమిపూజ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇకపై చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు గ్రామస్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ప్రాథమిక వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారని నాయకులు తెలిపారు.
విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం పూర్తయితే కుంకులమర్రు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.




