Guntur: గుంటూరులో పట్టపగలు రెచ్చిపోయిన బైక్ దొంగలు!
Guntur: గుంటూరు అరండల్పేట పోలీస్స్టేషన్ పరిధిలో పట్టపగలు బైక్ చోరీ జరిగింది. వెంగయ్యనగర్లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది.
Guntur: గుంటూరులో పట్టపగలు రెచ్చిపోయిన బైక్ దొంగలు!
Guntur: అరండల్పేట పోలీస్స్టేషన్ పరిధిలో బైక్ దొంగల హవా కొనసాగుతోంది. వెంగయ్యనగర్లోని 6వ లైన్లో ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్ను ముగ్గురు దొంగలు పట్టపగలే అపహరించారు. నంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన దుండగులు, ఎవరూ లేని సమయంలో ఇంటి ముందు ఉన్న బైక్ను తీసుకెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇదే ప్రాంతంలో గతంలోనూ బైక్లు మాయమైన ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న బైక్ చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దొంగలను పట్టుకోవాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.




