Palnadu: డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే 144 సెక్షనా బొల్లా ఆగ్రహం!
Palnadu: డీఎస్సీ అక్రమాలపై వినుకొండలో నిరసనను 144 సెక్షన్‌తో పోలీసులు అడ్డుకోవడంపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. అర్హులకు న్యాయం చేయాలన్నారు.
Palnadu: డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే 144 సెక్షనా బొల్లా ఆగ్రహం!
Palnadu: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, నిరుద్యోగ యువత చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. వినుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి విద్యార్థులు, యువతతో కలిసి నిర్వహించిన ర్యాలీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నాయకత్వం వహించారు.
డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి, విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు.
అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి నిరసనలను అడ్డుకునేందుకు 144 సెక్షన్‌ను ప్రయోగించడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాదని, డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం విద్యార్థులకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆరోపణలపై విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని బొల్లా హెచ్చరించారు.




