Bollapalli: బొల్లాపల్లి మండలంలో దారుణం అనుమానంతో ప్రియురాలి హత్య!

Bollapalli: బొల్లాపల్లి మండలం గరికపాడులో దారుణం. అనుమానంతో ప్రియురాలు లక్ష్మిని గొడ్డలితో నరికి చంపిన పెద్ద బ్రహ్మం. కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 16 Aug 2026 4:07 PM IST
Bollapalli
X

Bollapalli: బొల్లాపల్లి మండలంలో దారుణం అనుమానంతో ప్రియురాలి హత్య!

Bollapalli: వినుకొండ నియోజకవర్గం,బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామంలో అనుమానంతో ప్రియురాలిని గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి (32) కొంతకాలంగా గరికపాడు గ్రామానికి చెందిన అమర పెద్ద బ్రహ్మంతో కలిసి సహజీవనం చేస్తూ అక్కడే నివాసం ఉంటోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో లక్ష్మి ప్రవర్తనపై పెద్ద బ్రహ్మం అనుమానం పెంచుకున్నాడు. శనివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో ఆగ్రహానికి గురైన పెద్ద బ్రహ్మం, లక్ష్మిపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న బొల్లాపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

హత్యకు సంబంధించిన వివరాలను సేకరించి, స్థానికులను విచారించారు. నిందితుడు పెద్ద బ్రహ్మం ఘటన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story