Guntur: కూటమి హయాంలో ఆ ముగ్గురే హ్యాపీ.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన కామెంట్స్!
Guntur: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
Guntur: కూటమి హయాంలో ఆ ముగ్గురే హ్యాపీ.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన కామెంట్స్!
Guntur: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కామెంట్స్.. క్వింటా మొక్కజొన్నను 1650కి కొని తెలంగాణా రాష్ట్రంలో అత్యధిక ధరకు అమ్ముకుంటున్నారని అంబటి మురళీ ఆరోపిస్తే ఓర్వలేకపోయారు. గోడౌన్ పై టీడీపీ వాళ్ళే దాడి చేసి వాళ్ళే రైతులపై కేసులు పెడతారు. కూటమి నేతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటం రాదు పరిపాలన కూడా చేత కాదు. టీడీపీ వాళ్ళు చెబితే మోడీ మాట వినరట జగన్ చేబితేనే మోదీ మాట వింటారంట మొక్కజొన్న రైతులకు మా ముఖ్యమంత్రి లేఖ రాశాడు మీ జగన్ లేఖ కూడా రాయలేదని ధూళిపాళ్ళ అంటున్నాడు.
మోదీ మా మాటలు వినడు జగన్ మాటే వింటారని ధూళిపాళ్ళ అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వ హయంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంది ముగ్గురే ముగ్గురు నారా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మా జగన్ మోహన్ రెడ్డి కొట్టిన ప్రతి ఒక్కరూ డాన్ నే అక్రమ నేతల పైన జగన్ కేసులు పెట్టారా తప్పా అమాయకులను హింసించలేదు. రైతులకు ఏదైనా మంచి జరిగిందంటే అది జగన్ మోహన్ రెడ్డితోనే జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రతి గ్రామంలో కనిపిస్తుంది.
మొక్కజొన్న రైతులపై అక్రమ కేసులను వెంటనే తీసివేయాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అమరావతి అని జపం చేసేకన్నా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటే ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడు, చనిపోడు ఆత్మహత్య చేసుకున్న పిల్లాడి కుటుంబానికి న్యాయం చేస్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తా మేం అడుగుతుంది వేరు మీరు ఖండిస్తుంది వేరు కాంట్రవర్సీ చేయటానికి సిద్దార్థ రెడ్డి పోవటం లేదు కాంట్రవర్సీ జరిగిన చోటుకి బైరెడ్డి వెళుతున్నాడు.
అంబటి మురళీ కృష్ణ ధూళిపాళ్ళ అనే గుంట నక్క ఇక్కడ మొక్కజొన్న తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణాలో అమ్ముకుంటుంది. గుంట నక్కలను వేటాడేందుకు చిరుత వచ్చింది బైరెడ్డికి ఈ నియోజకవర్గ ఆడబిడ్డని కట్టబెట్టి ఈ చిరుత పులిని ఇదే నియోజకవర్గంలో ఉంచే ప్రయత్నం చేస్తాం రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తి వేసే వరకూ ఎంతో మంది నాయకులు వస్తూనే ఉంటారు. చంద్రబాబు గురించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలను కాపీ కొట్టి ధూళిపాళ్ళ నరేంద్ర నాపై ప్రయోగిస్తున్నాడు.




