Guntur: గుంటూరులో మాజీ ఎస్సైపై మహిళ తీవ్ర ఆరోపణలు!
Guntur: చేబ్రోలు మాజీ ఎస్సై వెంకటకృష్ణపై అత్యాచారం, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు. లాలాపేట పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన.
Guntur: గుంటూరులో మాజీ ఎస్సైపై మహిళ తీవ్ర ఆరోపణలు!
Guntur: గుంటూరు ఐపిడి కాలనీ లాలాపేట పీఎస్ పరిధిలో మాజీ ఎస్సైపై మహిళ ఫిర్యాదు. తీవ్ర ఆరోపణలు చేసిన బాధితురాలు. చేబ్రోలు మాజీ ఎస్సై దండా వెంకటకృష్ణపై అత్యాచారం కేసు నమోదై ఏడాది కావస్తున్నా దక్కని న్యాయం.
బాధితురాలి ఫిర్యాదు మేరకు 2025 సెప్టెంబర్ 17న లాలాపేట పీఎస్‌లో క్రైమ్ నం. 274/2025 కింద నమోదైన కేసు. కేసు నమోదైన నాటి నుంచి వీఆర్‌లోనే కొనసాగుతున్న మాజీ ఎస్సై వెంకటకృష్ణ.
కేసు ఉపసంహరించుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలి ఆరోపణ.
పెమ్మసాని శరణ్య, సురేష్ మేదరమెట్ల పేర్లతో ఉన్న ఖాతాల ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్న బాధితురాలు. తన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మహిళ ఆవేదన. ఎస్పీ, ఐజీలను ఎన్నిసార్లు కలిసినా ఫలితం శూన్యం.. పోలీసుల తీరుపై బాధితురాలి తీవ్ర అసంతృప్తి.
సోషల్ మీడియా వేధింపులపై ఆగస్టు 27, 2026 న లాలాపేట పోలీసులకు మరోసారి లిఖితపూర్వక ఫిర్యాదు.
కేసు నమోదై ఏడాది కావస్తున్నా చర్యలు లేకపోవడంపై విస్మయం. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితురాలి వేడుకోలు.




