Vinukonda: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదు!

Vinukonda: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరియు ఆయన అనుచరులపై వినుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Narsimha Reddy
Published on: 22 Jun 2026 9:38 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదు!

Vinukonda: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు ఆయన అనుచరులపై వినుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గండిపేట భూముల వ్యవహారంలో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలైన బొల్లా బ్రహ్మనాయుడు జూన్ 20న వినుకొండకు ర్యాలీగా చేరుకున్నారు. అయితే ఈ ర్యాలీ నిర్వహణకు ముందస్తుగా పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు విట్టంరాజుపల్లి వద్ద ర్యాలీని అడ్డుకుని, ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. అయితే ఈ సందర్భంగా బొల్లా అనుచరులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రధాన రహదారిపై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, ప్రజలు,వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించిన ఆరోపణలపై బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రభాకర్ వెల్లడించారు.

Narsimha Reddy

Narsimha Reddy

Next Story