Vinukonda: వైఎస్ జగన్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు!

Vinukonda: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 అక్రమాలు, డీఎస్సీ అంశాలపై అసెంబ్లీ చర్చకు రావాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండలో సవాల్.

KAREEMULLA, VINUKONDA
Published on: 13 Aug 2026 3:24 PM IST
Vinukonda
X

Vinukonda: వైఎస్ జగన్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు!

Vinukonda: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల్లో అవకతవకలు, డీఎస్సీ నియామకాలపై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

దమ్ముంటే ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరై చర్చకు రావాలని సవాల్ విసిరారు.వైసీపీ పాలనలో గ్రూప్-1 మూల్యాంకన ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని జీవీ ఆంజనేయులు తెలిపారు.

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన జగన్ ఈ అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించామని జీవీ తెలిపారు. అయితే మెగా డీఎస్సీపై వైసీపీ విషప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మెరిట్‌కు పట్టం కడితే జగన్‌కు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.

గ్రూప్-1, డీఎస్సీతో పాటు నిరుద్యోగ సమస్యలపై అసెంబ్లీలోనే సమగ్రంగా చర్చిద్దామని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆరోపణలు చేయడం కాకుండా సభకు వచ్చి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని జగన్‌కు సవాల్ విసిరారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story