Vinukonda: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజాదర్బార్.. అర్జీల స్వీకరణ!

Vinukonda: వినుకొండ టీడీపీ కార్యాలయంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మౌలిక వసతుల సమస్యలపై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 13 July 2026 12:19 AM IST
Vinukonda
X

Vinukonda: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజాదర్బార్.. అర్జీల స్వీకరణ!

వినుకొండ: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, ప్రజా సమస్యలను జీవి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రతి ఒక్కరి వినతులను జీవీ ఆంజనేయులు ఓర్పుగా విని, వినతి పత్రాలను స్వీకరించారు. ప్రధానంగా రహదారులు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ప్రజలు వివరించారు.సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల చెంతకే పాలనను తీసుకురావడం తమ బాధ్యత అని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story