Vinukonda: పేదరికం ప్రతిభకు అడ్డుకాదు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Vinukonda: వినుకొండలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదని ఆకాంక్ష.

KAREEMULLA, VINUKONDA
Published on: 16 Aug 2026 3:40 PM IST
Vinukonda
X

Vinukonda: పేదరికం ప్రతిభకు అడ్డుకాదు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Vinukonda: పేదరికం ప్రతిభకు ఏమాత్రం అడ్డంకి కాకూడదని, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యపై పెట్టే పెట్టుబడే సమాజ భవిష్యత్‌కు పెట్టుబడి అని తెలిపారు.చదువు ద్వారానే పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, వినుకొండ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

నేడు చేయూత పొందుతున్న విద్యార్థులు భవిష్యత్‌లో తాము స్థిరపడిన తర్వాత మరికొందరు పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పడే సేవా కార్యక్రమాలను శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం కొనసాగిస్తామని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story