Vinukonda: విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన చీఫ్ విప్ జీవీ

Vinukonda: వినుకొండలో భారీ వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చొరవతో అధికారులు రెండు రోజుల్లోనే పునరుద్ధరించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 22 Jun 2026 3:35 PM IST
Vinukonda
X

Vinukonda: విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన చీఫ్ విప్ జీవీ

Vinukonda: వినుకొండ పట్టణంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా రైలుపేట, డ్రైవర్స్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వెంటనే స్పందించి, అదే రాత్రి ఘటన స్థలాలను స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

చీఫ్ విప్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది వేగంగా చర్యలు చేపట్టి కేవలం రెండు రోజుల్లోనే దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి, తెగిపోయిన వైర్లను పునరుద్ధరించి విద్యుత్ సరఫరాను తిరిగి ప్రారంభించారు. అనంతరం జీవీ ఆంజనేయులు పనుల పురోగతిని, నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

తక్కువ సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. తమ సమస్యపై వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేసిన జీవీ ఆంజనేయులకు కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story