Vinukonda: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!
Vinukonda: వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి, పాఠశాలల్లో వసతులు, ఇళ్ల మంజూరుపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Vinukonda: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!
Vinukonda: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కలిసి వినుకొండ నియోజకవర్గంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొని వెళ్లారు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించవలసినదిగా కోరారు.వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల హాస్పిటల్ గా మార్చాలని, NSP స్థలంలో పలు భవనాల అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేయవలసినదిగా కోరారు.
పూర్వోదయ స్కీము కింద పల్నాడు జిల్లాలో నిధులు మంజూరు చేసి ఉద్యానవన పంటల అభివృద్ధికి సహకరించాలని కోరారు. వినుకొండ రూరల్ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. వినుకొండ ప్రభుత్వ పాఠశాలలలో 64 అదనపు తరగతి గదులు, 57 టాయిలెట్స్ మరియు 75 పాఠశాలలకు 17212 మీటర్ల కాంపౌండ్ వాల్ కు అవసరమని వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మీద శివశక్తి ఫౌండేషన్ ద్వారా CBN షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వడానికి అనుమతులు కోరారు.
కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని మరియు హౌస్ హోల్డ్ సర్వే స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇవ్వాలని, 2014 - 2019 మధ్య గృహాలు మంజూరు చేసే రూపాయి బిల్లు పడిన వాటికి మిగతా మొత్తంలో చెల్లించాలని , రూరల్ ఏరియాలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద గృహాలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.




