Vinukonda: గాలివాన దెబ్బకు స్తంభించిన వినుకొండ.. రంగంలోకి దిగిన చీఫ్ విప్!

Vinukonda: వినుకొండలో గాలివాన బీభత్సం! అర్ధరాత్రి వేళ రంగంలోకి దిగిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 19 Jun 2026 8:29 AM IST
Vinukonda
X

Vinukonda: గాలివాన దెబ్బకు స్తంభించిన వినుకొండ.. రంగంలోకి దిగిన చీఫ్ విప్!

Vinukonda: వినుకొండ నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పట్టణంలోని పలు ప్రధాన రహదారులు, కాలనీలు, కూడళ్ల వద్ద భారీ చెట్లు, కొమ్మలు విరిగి రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అర్ధరాత్రి వేళే ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు మరియు విపత్తు నిర్వహణ బృందాలతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

రోడ్లపై పడిన చెట్లు, కొమ్మలను తొలగించే పనులను స్వయంగా పర్యవేక్షించిన ఆయన, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు రాత్రంతా పనిచేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేశారు. ఎమ్మెల్యే చొరవను స్థానికులు అభినందించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story