Vinukonda: వినుకొండలో అధికారులకు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశం

Vinukonda: వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని 35 అర్జీలను స్వీకరించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 14 Jun 2026 5:52 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో అధికారులకు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశం

వినుకొండ: వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పింఛన్లు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, భూ సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 35 అర్జీలు అందాయి.

ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

ప్రజా దర్బార్‌లో సమర్పించిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ఆ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. సుపరిపాలన, సమన్యాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శక సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీవి ఆంజనేయులు సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story