Vinukonda: వినుకొండలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం!

Vinukonda: వినుకొండలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్య సాధనకు కృషి చేద్దామని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పిలుపు.

KAREEMULLA, VINUKONDA
Published on: 16 Aug 2026 6:46 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం!

Vinukonda: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాష్ట్ర ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ భారత్ సాధించడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విజన్–2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రజల కోసం, వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

జన్మభూమి స్ఫూర్తితో అహర్నిశలు ప్రజలకు సేవ చేస్తానన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారికి అండగా నిలుస్తున్నానని తెలిపారు.

వినుకొండ పట్టణ ప్రజల చిరకాల కోరికైన శాశ్వత మంచినీటి పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం, ఘాట్ రోడ్డు, గిరి ప్రదక్షణ రోడ్డు,వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు.

వినుకొండ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధిలో ముందంజలో నిలిపి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని అన్నారు. ప్రజలంతా చేయి చేయి కలిపి స్వర్ణాంధ్ర నిర్మాణానికి కృషి చేద్దామని జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story