Vinukonda: వైసీపీ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెప్పారు.. చీఫ్ విప్ జీవీ

Vinukonda: గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైనదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 18 Jun 2026 6:32 PM IST
Vinukonda
X

Vinukonda: వైసీపీ అరాచకాలకు ప్రజలే బుద్ధి చెప్పారు.. చీఫ్ విప్ జీవీ

Vinukonda: వైసీపీ ప్రభుత్వ గత ఐదేళ్ల పాలన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన పాలనగా నిలిచిందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. నాసిరకం మద్యం బ్రాండ్లను ప్రజలపై రుద్ది లక్షలాది కుటుంబాలను నాశనం చేశారని,

మద్యం విధానం ద్వారా అమాయకుల ప్రాణాలు బలిగొని జగన్ మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. "ఒక్క అవకాశం" పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. పెన్షన్ పెంపు, అమ్మఒడి వంటి పథకాల అమలులో కూడా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి గట్టి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు వర్గాలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,

ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. రాబోయే నెలల్లో సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story