Vinukonda: మెగా రుణ మేళాను విజయవంతం చేయాలి.. ప్రభుత్వ చీఫ్ విప్

Vinukonda: నరసరావుపేటలో జులై 17న నిర్వహించనున్న క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ విజయవంతం కోసం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ, ఎంపీ లావు క్యాడర్‌తో సమావేశం నిర్వహించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 16 July 2026 7:55 AM IST
Vinukonda
X

Vinukonda: మెగా రుణ మేళాను విజయవంతం చేయాలి.. ప్రభుత్వ చీఫ్ విప్

Vinukonda: జులై 17న నరసరావుపేట వేదికగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక 'క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్' (మెగా రుణ మేళా) ను విజయవంతం చేయడమే లక్ష్యంగా వినుకొండ నియోజకవర్గ కూటమి క్యాడర్‌తో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారు,కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలు, బ్యాంకింగ్ రంగం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందే రుణ సౌకర్యాలపై క్యాడర్‌కు సమగ్రంగా వివరించారు. మెగా రుణ మేళాకు అర్హులైన లబ్ధిదారులను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి వినుకొండ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, యూనిట్ ఇన్‌చార్జీలు, కూటమి అగ్రనాయకులు, ప్రజాప్రతినిధులు, క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story