Vinukonda: ఐదేళ్లు నిరుద్యోగులను ముంచింది వైసీపీ కాదా.. చీఫ్ విప్ జీవీ

Vinukonda: వైఎస్సార్‌సీపీ పాలనలో నిరుద్యోగులకు ‘జాబ్ క్యాలెండర్’ పేరుతో ఒట్టి హామీలే ఇచ్చి యువతను ఘోరంగా ముంచేశారని జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 29 May 2026 7:34 PM IST
Vinukonda
X

Vinukonda: ఐదేళ్లు నిరుద్యోగులను ముంచింది వైసీపీ కాదా.. చీఫ్ విప్ జీవీ

Vinukonda: వైఎస్సార్‌సీపీ పాలనలో నిరుద్యోగులకు ప్రతి ఏడాది “జాబ్ క్యాలెండర్” పేరుతో హామీలు ఇచ్చినా, ఒక్క మెగా డీఎస్సీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని చీప్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. ఐదేళ్లపాటు ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆయన పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తొలి నిర్ణయం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేయడమేనని తెలిపారు. ఇది నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.గతంలో డీఎస్సీ నోటిఫికేషన్లను కోర్టుల చుట్టూ తిప్పి అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నది వైఎస్సార్‌సీపీ కాదా? అని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, లీకేజీలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story