Narasaraopeta: కామేపల్లి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన చీఫ్ విప్ జీవీ
Narasaraopeta: బాపట్ల జిల్లా కామేపల్లి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Narasaraopeta: కామేపల్లి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన చీఫ్ విప్ జీవీ
Narasaraopeta: రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడం పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల పార్థివదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




