Vinukonda: సచివాలయంలో వినుకొండ ఆలయాల అభివృద్ధిపై మంత్రికి విప్ జీవీ వినతి
Vinukonda: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Vinukonda: సచివాలయంలో వినుకొండ ఆలయాల అభివృద్ధిపై మంత్రికి విప్ జీవీ వినతి
Vinukonda: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు.
ముఖ్యంగా వినుకొండలోని రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి సీజీఎఫ్ (CGF) మార్జిన్ మనీ శాతాన్ని ప్రస్తుతం ఉన్న 33 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని జీవీ ఆంజనేయులు కోరారు. ఇలా చేస్తే ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
అదేవిధంగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ‘శ్రీవాణి ట్రస్ట్’ నిధుల ద్వారా వినుకొండ నియోజకవర్గంలో కొత్త దేవాలయాల నిర్మాణానికి సహకారం అందించాలని కోరుతూ మరో లేఖను మంత్రికి అందజేశారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




