Chilakaluripet: బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
Chilakaluripet: చిలకలూరిపేటలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై విమర్శలు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.
Chilakaluripet: బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
చిలకలూరిపేట: చిలకలూరిపేట రూరల్ పరిధిలోని బొప్పిడి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో, జాతీయ రహదారి రోడ్డును ఆనుకుని ఏర్పాటు చేసిన KSS ఫైర్ వర్క్స్ దీపావళి బాణసంచా దుకాణం లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పండుగ సీజన్‌ను కాసుల వర్షంగా మార్చుకునే క్రమంలో వ్యాపారులు కనీస భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేశారు.
జాతీయ రహదారిపై వెలసిన ఏ ఒక్క దుకాణంలోనూ కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించిన దాఖలాలు లేకపోవడం శోచనీయం. భద్రతా ఏర్పాట్లు కేవలం తూతూమంత్రంగానే సాగుతున్నాయని, వాస్తవానికి అక్కడ రక్షణ చర్యలు శూన్యమని ఈ ఘటనే స్పష్టం చేస్తోంది.
మరోవైపు, సంబంధిత అగ్నిమాపక శాఖ అధికారుల తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. ముందస్తుగా నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకునే అధికారులు. ఇలాంటి ప్రాణాపాయ ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే హడావిడి చేయడం వారి ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కళ్లెదుటే మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




