Chilakaluripet: రోడ్డు ప్రమాదంలో మంత్రి గొట్టిపాటి డ్రైవర్ దుర్మరణం

Chilakaluripet: చిలకలూరిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ డ్రైవర్ తన్నీరు శ్రీహరి బైక్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 5 Oct 2026 11:12 PM IST
Chilakaluripet
X

Chilakaluripet: రోడ్డు ప్రమాదంలో మంత్రి గొట్టిపాటి డ్రైవర్ దుర్మరణం

చిలకలూరిపేట: చిలకలూరిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి డ్రైవర్ తన్నీరు శ్రీహరి దుర్మరణం. చిలకలూరుపేట నుంచి చెరువు రోడ్డు వైపు వెళ్లే మార్గంలో ప్రమాదం.

మలుపు వద్ద పల్సర్ బైక్‌పై వస్తున్న తన్నీరు శ్రీహరిని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీహరి అక్కడికక్కడే మృతి.

మృతదేహాన్ని పరిశీలన, పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA