Chilakaluripet: ఎమ్మెల్సీ నాగబాబు ఎమ్మెల్యే ప్రత్తిపాటి మొక్కలు నాటే కార్యక్రమం
Chilakaluripet: RVSCVS హైస్కూల్‌లో 50 మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, ఎమ్మెల్యే పుల్లారావు. పాఠశాల అభివృద్ధికి రూ.3.40 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటన.
Chilakaluripet: ఎమ్మెల్సీ నాగబాబు ఎమ్మెల్యే ప్రత్తిపాటి మొక్కలు నాటే కార్యక్రమం
Chilakaluripet: చిలకలూరిపేటలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పర్యటన, RVSCVS హైస్కూల్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్సీ నాగబాబు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు.
ఎమ్మెల్సీ నాగబాబు కామెంట్స్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు 50మొక్కలు నాటిన నాగబాబు, పాఠశాల ప్రాంగణంలో సుమారు 50 మొక్కలు నాటి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ఎమ్మాల్సి. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా AP గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా కృషి చేస్తానన్నా చైర్మన్ నాగబాబు.
ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చిన నాగబాబు చిలకలూరిపేటలో పచ్చదనం, గ్రీనరీ అభివృద్ధికి రూ.3 కోట్లతో కృషి చేస్తామని ప్రకటన. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు, విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచన. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని పిలుపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు
పత్తిపాటి కామెంట్స్
పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా చిలకలూరిపేటలో మొక్కలు నాటే కార్యక్రమం. క్యాబినెట్ హోదాలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కార్యక్రమాన్ని చిలకలూరిపేటలో ప్రారంభించిన కొణిదెల నాగబాబు. నాగబాబు చేతుల మీదుగా వేప మొక్క నాటి సుమారు 40 మొక్కల పెంపకం ప్రారంభం.
చిలకలూరిపేట నడిబొడ్డున ఉన్న RVSCVS హైస్కూల్ అభివృద్ధికి కృష్ణతేజ సహకారంతో ప్రత్యేక చర్యలు. యూనియన్ బ్యాంక్ CSR నిధులు రూ. 3 కోట్లు, SAP ద్వారా రూ. 40 లక్షలు మొత్తం రూ. 3.40 కోట్లు గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, క్రీడా మైదానం అభివృద్ధికి కేటాయింపు.
స్కూల్ నూతన భవనాల నిర్మాణం కోసం అదనంగా రూ. 2 కోట్ల నిధులు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ‘పచ్చదనం - పరిశుభ్రత’కు పెద్దపీట.
ప్రజా నాయకుడిగా పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపాటి పుల్లారావు.




