Kakumanu: గురుకులం బాలికల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

Kakumanu: కాకుమాను డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెట్ జీరో, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 15 Nov 2026 8:02 AM IST
Kakumanu
X

Kakumanu: గురుకులం బాలికల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

Kakumanu: గుంటూరు జిల్లా కాకుమానుమండలం కాకుమానులో డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాల, కాకుమానులో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నెట్ జీరో (Net Zero) కార్యక్రమం గురించి సైన్స్ ఉపాధ్యాయులు మరియు నెట్ జీరో కోఆర్డినేటర్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా సేంద్రియ పద్ధతుల ద్వారా ఆహార పంటలను మనమే పండించుకోవడం, ప్రకృతి వనరులను సంరక్షించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం వంటి అంశాలను వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శ్రీ జి. వీరాస్వామి గారు, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీ నాగయ్య గారు విచ్చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పి. స్వర్ణలత గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి డి. హవీలా ప్రియదర్శిని గారు, పీజీటీ సోషల్ ఉపాధ్యాయులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు విద్యార్థులకు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్య, క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై విలువైన సందేశాలను అందించారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్య అతిథులు వీక్షించి అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ముఖ్య అతిథులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

చివరిగా ఎంపీడీఓ శ్రీ జి. వీరాస్వామి గారి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందోత్సాహాలను నింపడంతో పాటు విద్య, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యత పట్ల చైతన్యాన్ని కలిగించింది.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU