Chirala: శ్రీహరి ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా చేరికలు
Chirala: చీరాలలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో మాజీ కౌన్సిలర్ గాజుల శ్రీహరి ఆధ్వర్యంలో 100 మంది టీడీపీలో చేరారు. పార్టీ కండువాలతో ఆహ్వానించారు.
Chirala: శ్రీహరి ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా చేరికలు
చీరాల: చీరాల మున్సిపాలిటీ 22వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు గాజుల శ్రీహరి ఆధ్వర్యంలో సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొని, పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
గాజుల శ్రీహరి నాయకత్వంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని, అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
చీరాల నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది టీడీపీతో కలిసి పనిచేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, చీరాల పట్టణ అధ్యక్షులు దోగుపర్తి సురేష్, చీరాల మున్సిపల్ మాజీ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, జనసేన పార్టీ నాయకులు మామిడాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




