Chirala: చీరాల వేదికగా బాపట్ల జర్నలిస్టుల ఫ్రెండ్లీ మ్యాచ్!

Chirala:బాపట్ల జిల్లా చీరాల వాడరేవు రోడ్డులో విలేకరుల మానసిక ఉల్లాసం కోసం చీరాల, బాపట్ల జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఘనంగా జరిగింది.

KaleshaVali (Bhasha), Chirala
Updated on: 30 July 2026 12:00 AM IST
Chirala
X

Chirala: చీరాల వేదికగా బాపట్ల జర్నలిస్టుల ఫ్రెండ్లీ మ్యాచ్!

చీరాల: మానసిక ఉల్లాసం, పరస్పర స్నేహభావం, మీడియా మిత్రుల మధ్య ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో బుధవారం వాడరేవు రోడ్డులోని హాయ్ రెస్టారెంట్ వెనుక ఉన్న విశాలమైన మైదానంలో చీరాల, బాపట్ల ప్రాంతాలకు చెందిన విలేకరులు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.

ఈ మ్యాచ్‌లో చీరాల, బాపట్ల మీడియా మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సరదాగా ఆటను ఆస్వాదించారు. గెలుపోటములకు అతీతంగా పూర్తిగా స్నేహపూర్వక వాతావరణంలో మ్యాచ్ సాగింది. వృత్తిపరమైన ఒత్తిడికి కొంత విరామం ఇచ్చి అందరూ కలిసి ఉల్లాసంగా గడిపారు.

ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల విలేకరులు ఒకరినొకరు ఆప్యాయంగా పరిచయం చేసుకుంటూ పరస్పర అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు మీడియా మిత్రుల మధ్య ఐక్యత, స్నేహభావాన్ని మరింత పెంపొందిస్తాయని పాల్గొన్న విలేకరులు పేర్కొన్నారు. మనమందరం బాపట్ల జిల్లాకు చెందిన మీడియా మిత్రులమే కావడంతో పరస్పర పరిచయాలు మరింత పెరిగితే ఐకమత్యం బలోపేతం అవుతుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి స్నేహపూర్వక క్రీడా కార్యక్రమాలను తరచూ నిర్వహించుకోవాలని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.

ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో డి. దిలీప్ (ఆర్‌కే న్యూస్), ఎం. కోటేశ్వరరావు (పల్నాటి వార్త), కె. రాజేష్ (బిగ్ టీవీ), ఆనంద్ కుమార్, ఆర్.వి.బి. చిన్నబాబు (పల్నాటి సాక్షి), షేక్ సుభాని (టైమ్స్ న్యూస్), జే. రత్నం (స్వతంత్ర టీవీ), సుధాకర్ (సుధాకర్ టీవీ), కె. వాసు (ఏఎన్‌ఎన్), న్యూస్ భాష (హెచ్‌ఎంటీవీ), చిన్న (క్రైమ్ కౌంటర్), దుర్గాప్రసాద్ (సిక్స్ టీవీ), మస్తాన్ వలి (కాకతీయ న్యూస్)తో పాటు పలువురు మీడియా మిత్రులు పాల్గొన్నారు.

ఈ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌కు ఆంధ్రజ్యోతి న్యూస్ రిపోర్టర్ ప్రదీప్ సమన్వయం వహించి అందరికీ ప్రోత్సాహం అందించారు. ఇంకా పలువురు మీడియా మిత్రులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన కారణాల వల్ల పాల్గొనలేకపోయారు. వారు ప్రత్యక్షంగా హాజరు కాకపోయినా తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయగా, వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమం అనంతరం అందరూ కలిసి ఆత్మీయంగా గడిపి, ఇలాంటి స్నేహపూర్వక కార్యక్రమాలు మీడియా మిత్రుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story