Chirala: చీరాలలో భారీ గోల్డ్ స్కామ్: రూ. 20 కోట్లతో నగల వ్యాపారి జంప్!

Chirala: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో సంచలన మోసం వెలుగు చూసింది.

GANESH, JAMMIKUNTA
Published on: 19 Jun 2026 11:56 AM IST
Chirala
X

Chirala: చీరాలలో భారీ గోల్డ్ స్కామ్: రూ. 20 కోట్లతో నగల వ్యాపారి జంప్!

చీరాల: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో సంచలనం సృష్టించిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్థానిక బ్రహ్మంగారి చెట్టు వద్ద నగల వ్యాపారం నిర్వహిస్తున్న బిట్రా రాఘవేంద్రరావు అనే వ్యాపారి కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు సేకరించి రాత్రికి రాత్రే పరారైన ఘటనతో బాధితులను రోడ్డేక్కారు.

ఏళ్లుగా నమ్మకంగా వ్యాపారం చేస్తూ వచ్చిన బిట్రా రాఘవేంద్రరావు, కస్టమర్ల విశ్వసాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున డబ్బులు, బంగారం సేకరించారని ఆరోపణలు చేశారు. కొందరు బంగారు నగలు తయారు చేయించుకోవడానికి తమ వద్ద ఉన్న బంగారాన్ని అప్పగించగా, మరికొందరు కొత్త నగల కోసం లక్షల రూపాయలు ముందస్తుగా చెల్లించినట్లు బాధితులు వాపోతున్నారు.

అయితే 4 రోజులుగా వ్యాపారి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కస్టమర్లు అతని ఇంటికి వెళ్లగా, ఇంటిని పూర్తిగా ఖాళీ చేసి కుటుం బంతో సహా పరారై నట్లు గుర్తించారు. దింతో ప్రస్తుతం బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తూ ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు. మోసపోయిన వారి సంఖ్య, నష్టపోయిన మొత్తం రోజురోజుకు పెరుగుతున్నట్లు సమాచారం.

కొందరు జీవితకాల పొదుపులను కోల్పోగా, మరికొందరు పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం దాచుకున్న బంగారాన్ని అప్పగించి ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయారు. బాధితులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పరారీలో ఉన్న వ్యాపారిని వెంటనే అరెస్టు చేసి తమ సొమ్ము, బంగారం తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. అయితే బంగారం, నగదు రూపంలో 20 కోట్లకు పైగా దోచుకొని రాఘవేంద్రరావు ఉడాఇంచారని బాధితులు చెబుతున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story