Chirala: చీరాల ఆసుపత్రిలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Chirala: చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ. రూ.23.75 కోట్ల క్రిటికల్ కేర్ భవన పనుల పరిశీలన.
Chirala: చీరాల ఆసుపత్రిలో ఎమ్మెల్యే, కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Chirala: చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ బి. వినోద్ కుమార్ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలతో పాటు అత్యవసర విభాగం, చిన్నపిల్లల వార్డులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య , కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అనంతరం రూ.23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మరియు కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో చేపట్టనున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య మాట్లాడుతూ చీరాల ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. క్రిటికల్ కేర్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.




