Chirala: చీరాల పేరాల మసీదు సెంటర్‌లో మద్యం దుకాణం తొలగించాలని ఆందోళన!

చీరాల పేరాల మసీదు సెంటర్‌లో కొత్త మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 14 Oct 2026 9:57 PM IST
Chirala
X

Chirala: చీరాల పేరాల మసీదు సెంటర్‌లో మద్యం దుకాణం తొలగించాలని ఆందోళన!

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల మసీదు సెంటర్‌లో మద్యం దుకాణం తొలగించాలంటూ మరోసారి స్థానికులు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.

రోడ్డుపై బైటయించి..దుకాణాన్ని వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు అడ్డుకొని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే ఒక దుకాణంతో ఇబ్బందులు పడుతుంటే..ఇప్పుడు మరో దుకాణం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నమాజ్ చేసుకునే పవిత్ర స్థలం, నిత్యం మహిళలు తిరిగే ప్రాంతంలో ఈ దుకాణం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. మద్యం దుకాణం తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala