Chirala: విద్య ద్వారానే సామాజిక పురోగతి సాధ్యం ఐటీసీ మేనేజర్ ఎన్. రామకృష్ణారావు

Chirala: చీరాల పట్టణంలోని ‘మార్పు’ స్వచ్ఛంద సంస్థ ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది.

Chirala
X

Chirala: విద్య ద్వారానే సామాజిక పురోగతి సాధ్యం ఐటీసీ మేనేజర్ ఎన్. రామకృష్ణారావు

చీరాల: పట్టణంలోని మార్పు స్వచ్చంద సంస్థ కార్యాలయంలో శనివారం రెండవ వార్షికోత్సవంతో పాటుగా మార్పు స్వచ్చంద సంస్థ కార్యాలయంలో పేద విద్యార్థులకు ఉచితంగా నిర్వహించే కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్, తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిపికెట్లు పంపిణి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా చీరాల ఐటీసీ కంపెనీ పర్సనల్ మేనేజర్ N.రామకృష్ణారావు హజరయ్యారు.

సమాజంలో సామాజిక ,ఆర్థిక పురోగతి కేవలం నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమని,, అటువంటి విద్యా రంగంలో పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న మార్పు స్వచ్చంద సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని చీరాల ఐటీసీ కంపెనీ పర్సనల్ మేనేజర్ N.రామకృష్ణారావు అన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా నిర్వహించే కంప్యూటర్ శిక్షణ , స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిపికెట్లు పంపిణి కార్యక్రమం జరిగింది .

ఈసందర్భంగా అయన మాట్లాడుతూ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ , కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరమన్నారు.అయితే పేద విద్యార్థులకు ఆర్థికభారం కాకూడదనే ఉదేశ్యంతో స్వచ్చందంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం మార్పు సంస్థ ముందుకొచ్చి ఆర్థికబారమైనప్పటికీ గడచిన రెండు సంవత్సరాల కాలంలో తొమ్మిది బ్యాచిల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి పోత్సహించడం అభినందనీయమన్నారు.

అనంతరం మార్పు స్వచ్చంద సంస్థ చైర్మన్ మార్పు గ్రెగొరీ మాట్లాడుతూ సమాజంలో మార్పు విద్య ద్వారానే ..అనే సిద్ధాంతాన్ని నమ్మి ఎటువంటి లాభాపేక్షలకు తావులేకుండా మార్పు సంస్థను స్థాపించామన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన పేద విద్యార్థులు ఈ కోర్సులకు దూరం కాకూడదనే ఉద్యేశ్య ముతోనే గత రెండు సంవత్సరాలు గా ఎంతో మందికి ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇచ్చామని తెలియ చేసారు.

ఈకార్యక్రమం ద్వారా నిరుపేదలకు తమకు సాధ్యమైనంత వరకు ఉచిత విద్యను అందించి మంచి భవిష్యత్ కు బాటలు వేసేలా కృషి చేస్తున్నామన్నారు.అనంతరం కంప్యూటర్,స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిపికెట్ల పంపిణి కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ CA లాజర్ , విశ్రాంతి ప్రిన్సిపాల్ యం.విన్సెంట్ పాల్ ,ITC యూనియన్ , జనరల్ సెక్రెటరీ సుధాకర్ రెడ్డి,ఆంగ్ల ఉపాధ్యాయలు డ్యానియల్ , చరణ్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story