Chirala: ఆయిల్ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే మాలకొండయ్య

Chirala: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన హైస్పీడ్ డీజిల్ సబ్సిడీ కార్డులను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వాడరేవు మత్స్యకారులకు అందజేశారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 3 Oct 2026 3:08 PM IST
Chirala
X

Chirala: ఆయిల్ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే మాలకొండయ్య

Chirala: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న డీజిల్ ఆయిల్ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. చీరాల మండలం బుర్రవారిపాలెం గ్రామం నందు నిర్వహించిన గ్రామ సభలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో వేట వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన హైస్పీడ్ డీజిల్ ఆయిల్ సబ్సిడీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వాడరేవు గ్రామం లో 235మందికి ఈ కార్డులు మంజూరు కాగా, ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి కార్డుల పంపిణీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్డుల ద్వారా ప్రతి లీటరుకు తొమ్మిది రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం ద్వారా లభిస్తుందన్నారు. గరిష్టంగా నెలకు 300లీటర్లకు ఆయిల్ సబ్సిడీ పొందవచ్చని తెలిపారు.

వేట వృత్తిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వేట విరామ సమయంలో రూ.ఇరవై వేలు ఆర్థిక సహాయం సకాలంలో అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం సద్వినియోగం చేసుకుని వేట వృత్తిపై ఆధారపడిన కుటుంబాల వారు ఆర్ధికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు.

తీర ప్రాంత గ్రామాలను సమీకృత మత్స్య సంపద సముదాయంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు రెవిన్యూ అధికారులు కూటమి నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala