Chirala: ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దులూరి
Chirala: చీరాలలో 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని, రెండేళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
Chirala: ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దులూరి
చీరాల: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న "ఇంటింటికి టీడీపీ" ప్రచార కార్యక్రమంలో భాగంగా చీరాల మండలం చీరాల నగర్ నందు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ విజయాలను తెలియజేస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు.
ప్రతి ఇంటికి అభివృద్ధి – ప్రతి కుటుంబానికి సంక్షేమం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు.
Next Story




