Chirala: చీరాలలో తక్కువ ధరలకే బియ్యం విక్రయాలు ప్రారంభం!

Chirala: చీరాలలో తక్కువ ధరలకే బియ్యం అందించే ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య. బాబా రైస్ మిల్ వద్ద విక్రయాలు ప్రారంభం.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 3 Aug 2026 3:02 PM IST
Chirala
X

Chirala: చీరాలలో తక్కువ ధరలకే బియ్యం విక్రయాలు ప్రారంభం!

చీరాల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసరాలను అందించే కార్యక్రమంలో భాగంగా, చీరాల మార్కెట్ వెనుక రోడ్డులో ఉన్న బాబా రైస్ మిల్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో తగ్గించిన ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమాన్ని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ఘనంగా ప్రారంభించి, పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మాట్లాడుతూ — పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్ల కౌంటర్లు మరియు 500 రైస్ మిల్లర్స్ ప్రత్యేక పాయింట్ల ద్వారా తగ్గించిన ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల అబ్జర్వర్ చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్ షేక్ కరీముల్లా, AMC Chirala చైర్మన్ కౌతరపు జనార్ధన్, RDO నరసింహారావు, బాపట్ల జిల్లా BJP అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story