Chirala: 6, 32 వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే కొండయ్య ప్రచారం!

Chirala: చీరాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య. 6, 32 వార్డుల్లో కూటమి కౌన్సిలర్, చైర్‌పర్సన్ అభ్యర్థి హానీ స్పందన గెలుపుకు పిలుపు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 24 Oct 2026 11:07 PM IST
Chirala
X

Chirala: 6, 32 వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే కొండయ్య ప్రచారం!

చీరాల: చీరాల పట్టణంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని 6వ వార్డు కూటమి అభ్యర్థి కొప్పోలు అన్నపూర్ణ, 32వ వార్డు అభ్యర్థి పాలవలస రమాదేవితో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి హానీ స్పందన విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే అభివృద్ధి ప్రతి వార్డుకు చేరాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల ఆశీర్వాదంతో పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

‘చెప్పాం, చేస్తున్నాం’ అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ, చీరాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు ప్రశాంతమైన, సుందరమైన పట్టణంగా రూపుదిద్దుకోవాలంటే సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నాయకత్వంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ స్థానాల్లో కూటమి అభ్యర్థుల కోసం నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, మిత్రపక్షాల నేతలు, స్థానిక ప్రముఖులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తల నినాదాలతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala