Chirala: వైసీపీ లాంటి పార్టీ రాష్ట్రానికి పెను ప్రమాదం ఎమ్మెల్యే మాలకొండయ్య

Chirala: బాపట్ల జిల్లా చీరాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య. సీఎం చంద్రబాబు విజనరీ పాలనపై ప్రశంసలు, వైసీపీపై విమర్శలు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 1 July 2026 3:45 PM IST
Chirala
X

Chirala: వైసీపీ లాంటి పార్టీ రాష్ట్రానికి పెను ప్రమాదం ఎమ్మెల్యే మాలకొండయ్య

చీరాల: కులాల మధ్య చిచ్చుపెట్టె గొడ్డలి పార్టీకి ప్రజలే బుద్ది చెబుతారని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో 23 వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని.. లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు. 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ బుద్ది మారలేదని ఎమ్మెల్యే అన్నారు.

మహిళా మంత్రిపై అసభ్య పదజాలంతో మాట్లాడటం, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రెచ్చగొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్నారు. వైసీపీ లాంటి పార్టీ రాష్టానికి పెను ప్రమాదమని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పాలనలో జరిగిన అభివృద్ధి సీఎం చంద్రబాబు విజనరికి నిదర్శనమన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story