Chirala: చీరాలలో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Chirala: చీరాల మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను కమిషనర్ కూరపాటి డానియల్ జోసెఫ్ ప్రకటించారు. నేటి నుంచి అక్టోబర్ 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 15 Oct 2026 10:38 PM IST
Chirala
X

Chirala: చీరాలలో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Chirala: చీరాల మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు గురువారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కూరపాటి డానియల్ జోసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీలోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

అదే రోజు కౌన్సిలర్ పోటీదారులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.నవంబర్ 5న. గెలుపు పొందిన వార్డు కౌన్సిలర్లచే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆయన తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిబంధనలను పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు సమావేశంలో వివరించారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala