Chirala: చీరాలలో నారాయణ స్కూల్ బస్సు ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయం!

Chirala: చీరాల నారాయణ స్కూల్ బస్సు అద్దం పగిలి 4వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయం. పట్టించుకోని యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం, న్యాయం చేయాలని డిమాండ్.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 27 Aug 2026 10:02 AM IST
Chirala
X

Chirala: చీరాలలో నారాయణ స్కూల్ బస్సు ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయం!

Chirala: చీరాల కొత్తపేటలోని నారాయణ పాఠశాల బస్సులో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అద్దం పగలడంతో అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జాషువా డేనియల్ బస్సు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

విద్యార్థి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో తన కుమారుడి కంటి సమీపంలో తీవ్ర గాయమైందని, కంటి పక్కన ఉన్న ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారని కన్నీరుమున్నీరుగా ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి పరిస్థితి చూసి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోందన్నారు.

ప్రమాదం జరిగిన అనంతరం పాఠశాల యాజమాన్యం తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని, ఘటనపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని తల్లి ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ కుటుంబానికి అండగా నిలిచి, విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

**పిల్లల భద్రతపై పాఠశాల యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలి. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకునే సమయంలో ఎన్నో హామీలు ఇస్తున్న యాజమాన్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదు అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story