Chirala: ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మొక్కలు నాటిన జనసేన శ్రేణులు!

Chirala: చీరాలలో జనసేన నాయకుడు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 3 Sept 2026 8:23 AM IST
Chirala
X

Chirala: ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మొక్కలు నాటిన జనసేన శ్రేణులు!

Chirala: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా, సామాజిక కార్యక్రమాలను చేపట్టి పవన్ కళ్యాణ్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

వేడుకల్లో భాగంగా తొలుత ఎన్‌ఆర్ అండ్ పీఎం హైస్కూల్ ప్రాంగణంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు.

అనంతరం చీరాల గడియార స్తంభం సెంటర్‌లో జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం, కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆమంచి స్వాములు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా సేవ, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్‌కు ప్రజల తరఫున, జనసేన పార్టీ శ్రేణుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story