Chirala: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు భారీ బైక్ ర్యాలీ!
Chirala: చీరాలలో జనసేన నియోజకవర్గ పరిశీలకులు అలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ప్రత్యేక పూజలు, భారీ బైక్ ర్యాలీ మరియు ఆత్మీయ సమ్మేళనం.
Chirala: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు భారీ బైక్ ర్యాలీ!
Chirala: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ పరిశీలకులు అలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చీరాల ప్రసాద్ థియేటర్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద్ థియేటర్ నుంచి చీరాల ప్రధాన కూడలి మీదుగా సప్తగిరి లాడ్జి ఫంక్షన్ హాల్ వరకు భారీగా జనసేనికులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జనసేన నాయకులు, అభిమానులు, వీర మహిళలు కేక్ కట్ చేశారు. పిఠాపురంలో నిర్వహించిన సభను ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసి వీక్షించారు.
ఈ సందర్భంగా అలా అనిల్ కుమార్ మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, మహిళలకు అండగా నిలవడమే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల తరఫున పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




