Chirala: ఆర్డీవో నరసింహారావు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
Chirala: చీరాలలో ఆర్డీవో నరసింహారావు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ నెల 28లోగా ఓటర్ల హీరింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Chirala: ఆర్డీవో నరసింహారావు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
చీరాల: ఆర్డీవో నరసింహారావు ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గ పొలిటికల్ పార్టీ ప్రతినిధులతోటి సమావేశం. సర్ ప్రక్రియలో భాగంగా పొలిటికల్ పార్టీల తోటి ఆర్డిఓ నరసింహారావు ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. ముసాయిదా ఓటర్ల ప్రక్రియలో భాగంగా ముసాయిదా లో లేని ఓటర్లను.
ఇమ్యురేషన్ మ్యాపింగ్ లో భాగంగా ఇప్పటివరకు 30937 ఓటర్లను హిరింగ్ చేశామని ఇంకా 14% మిగిలి ఉందని అవి కూడా తొందరగా ప్రక్రియ ముగించాలని తెలియజేశారు. ఈ ప్రక్రియ ఈనెల 28వ తారీకు ముగుస్తుందని ఈ లోపల హీరింగ్ చేయించుకోకపోతే శాశ్వతంగావారి ఓట్లు తొలగించబడుతుందని తెలియజేశారు.
కొత్త ఓటర్లు చేర్చుకోవడం ప్రారంభించారని ఫారం సిక్స్ పూర్తి చేసి బిఎల్వోలకు ఇవ్వాలని ఈ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల బిఎల్ఎలు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ, చీరాల మున్సిపల్ డిడి, వేటపాలెం ఎమ్మార్వో డిడి,
తెలుగుదేశం పార్టీ నుండి అడ్వకేట్ కీర్తి ప్రసాద్, జనసేన పార్టీ నుండి గూడూరు శివరామ ప్రసాద్, వైయస్ఆర్ పార్టీ నుండి యాతం మేరి బాబు, అనిల్ బిజెపి పార్టీ నుండి అరవపల్లి కుమార్, మేడికొండ భరణిరావు, బీఎస్పీ పార్టీ నుండి భగత్ సింగ్. మరియు ఎండిఓ ఎమ్మార్వో.మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




