Chirala: డీఎస్సీ నియామకాలపై వైసీపీ దుష్ప్రచారం టీడీపీ ఖండన!

Chirala: కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని చీరాల టీడీపీ కార్యాలయంలో నాయకులు తీవ్రంగా ఖండించారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 31 July 2026 10:48 AM IST
Chirala
X

Chirala: డీఎస్సీ నియామకాలపై వైసీపీ దుష్ప్రచారం టీడీపీ ఖండన!

Chirala: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన డీఎస్సీ ఎంపిక ద్వారా 16 వేల ఉద్యోగాలు అక్రమం అని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాల్ని ఈ రోజున చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

పారదర్శకంగా చేసిన నియామకలను వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వీళ్ళు కూడా అలానే చేసి ఉంటారని వక్ర ఆలోచన చేస్తున్న వైసీపీ నాయకులకు బుద్ధి రావాలని కోరారు. ఈరోజు ఆముదాలవలసలో మహిళా ఎస్సైపై వైసిపి బాధ్యత కలిగిన వైకాపా వ్యక్తులు ఆ మేడం గారిని దిగ్బంధం చేసి చాలా ఇబ్బందికర పరిస్థితులు చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఆ దుశ్యాసనపర్వం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసు వ్యవస్థపై దుందుడుకు చర్య చేయటం తప్పని, బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా ఎస్సైపై పై ఈరోజు జరిగిన దుశ్శాసనపర్వం సభ్య సమాజం తల దించుకునేటట్లుగా ప్రవర్తించారని వాళ్ల పరిపాలనొస్తే మహిళల పరిస్థితి సంఘంలో మంచిగా ఉన్న పౌరుల మీద ఎలాంటి దుశ్చర్యలు ఉంటాయో ఈ చర్య భయభ్రాంతుల గురి చేస్తుందని తెలుపుతూ నిరసిస్తూ నినాదాలు చేయడం జరిగినది.

ఏ.యం.సి చైర్మన్ కౌతరపు జనార్ధనరావు, బాపట్ల జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మువ్వా శరత్చంద్ర, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగిపర్తి బాలకృష్ణ, టౌన్ అధ్యక్షులు దోగుబర్తి సురేష్, చీరాల మండల యువత అధ్యక్షులు గొర్ల నరేంద్ర, చీరాల టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు వేణు, కోటి దాసు, బుర్ల శివప్రసాద్, గుమ్మడి యేసురత్నం, సున్నపు సుబ్బారావు, చెన్నంశెట్టి గిరీష్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story