Chirala: సేవా కార్యక్రమాలతో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల జన్మదిన వేడుకలు
Chirala: చీరాలలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పుట్టినరోజును పురస్కరించుకుని గోశాలకు విరాళం, భక్తులకు అన్నప్రసాదం అందించి ఆదర్శంగా నిలిచారు.
Chirala: సేవా కార్యక్రమాలతో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల జన్మదిన వేడుకలు
చీరాల: చీరాల ఎన్.ఆర్.& పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యుల జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వాకింగ్ సభ్యులు తమ జన్మదినాలను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించి ఆదర్శంగా నిలిచారు.
వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు గుర్రం బదరీనాథ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేరాల శివాలయంలో భక్తులకు పులిహోర పంపిణీ చేసేందుకు రూ.3,000 నగదును అందజేశారు. అలాగే మరో వాకింగ్ సభ్యుడు గొడవర్తి కృష్ణమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ గోశాలకు రూ.1,11,116 (ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీకృష్ణ గోశాల అధ్యక్షుడు దేవకి సుబ్బారావుకు అందించారు. ఈ సందర్భంగా గుర్రం బదరీనాథ్, గొడవర్తి కృష్ణమూర్తి ఇద్దరినీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదిన వేడుకలను వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా ఆలయ భక్తులకు అన్నప్రసాదం, గోశాలకు విరాళం వంటి సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం వాకింగ్ సభ్యులకు అల్పాహారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, కార్యదర్శి చారగుళ్ల గురుప్రసాద్, ఆలపాటి రామారావు, గుర్రం మోహనరావు, శీరాం రమేష్, నారాయణమూర్తి, గోలి మల్లికార్జునుడు, అన్నదాత పాండురంగారావు, డాక్టర్ ఐ. బాబూరావు, వెంకటేశ్వరరావు, నరసింహరావు, శివ, తారక రామారావు తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.




