Chirala: చీరాలలో 6200 విభూది చందనం గడ్డలతో వినాయక ప్రతిమ!

Chirala: బాపట్ల జిల్లా చీరాల అమరావారి వీధిలో 6200 విభూది చందనం గడ్డలతో 10 అడుగుల వినాయకుడు. పర్యావరణ పరిరక్షణ సందేశంతో ఉత్సవాలు నిర్వహించిన భక్త సమాజం.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 15 Sept 2026 9:09 AM IST
Chirala
X

Chirala: చీరాలలో 6200 విభూది చందనం గడ్డలతో వినాయక ప్రతిమ!

Chirala: భాపట్ల జిల్లా చీరాల అమరావారి వీధిలో వేంచేసి యున్న శ్రీ అభయ గణపతి స్వామి ఆలయాప్రాంగణం లో శ్రీ గణపతి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినూత్నంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వినాయక చవితి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. సంప్రదాయానికి భిన్నంగా, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే విధంగా ప్రతి సంవత్సరం విభిన్న రూపాల్లో వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేస్తూ శ్రీ గణపతి బాలభక్త సమాజం ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

అదే విదంగా 68 వ వార్షికోత్సవం పురస్కరిచుకోని ఈ సంవత్సరం 6200 విభూది చందనం గడ్డలతో 10 అడుగుల ఎత్తులో నిర్మితమైన విభూది చందనం గణపతిని రూపాన్ని ఏర్పాటు చెశారు. ఈ విభూది చందనం గణపతి రూపం వీక్షకులను ఎంతగానో అల్లరిస్తుంది. ఒక సంవత్సరం నవధన్యలతో, మరో సంవత్సరం గాజులతో రంగురంగుల బియ్యంతో వినాయకుని రూపాలను రూపొందిస్తూ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

వినాయక చవితి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా, ప్రకృతిని కాపాడాలి.. పర్యావరణాన్ని పరిరక్షించాలి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలి అనే సందేశాన్ని అందించేలా శ్రీ గణపతి బాలభక్త సమాజం కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala