Guntur: సీఐ రాములు నాయక్‌పై భార్య సంచలన ఆరోపణలు!
Guntur: సీఐ రాములు నాయక్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడంటూ భార్య తెనాలి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది
Guntur: సీఐ రాములు నాయక్‌పై భార్య సంచలన ఆరోపణలు!
గుంటూరు: తన మొదటి భర్తతో విభేదాల సమయంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనను అప్పటి ఎస్‌ఐ రాములు నాయక్ ట్రాప్ చేశాడని బాధిత మహిళ ఆరోపణ.
తనను శ్రీశైలంలో వివాహం చేసుకుని, ఇప్పుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని బాధితురాలి ఆరోపణ.తనకు ప్రాణహాని ఉందని, వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడన్న బాధితురాలు.
సీఐ రాములు నాయక్‌పై తెనాలి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి డిమాండ్.న్యాయం కోసం ఐజీని కలిసేందుకు వెళ్లినా, అవకాశం కల్పించలేదని బాధిత మహిళ ఆవేదన.
పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని బాధితురాలి విజ్ఞప్తి.సీఐ రాములు నాయక్‌పై వచ్చిన ఆరోపణలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.
తెనాలి సీఐగా ఉన్న సమయంలో రౌడీషీటర్లకు నడిరోడ్డుపై అరికాళ్లకు కోటింగ్ ఇచ్చిన ఘటనతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారిన రాములు నాయక్.




