Guntur: అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై సిఐడి డిఎస్పితో చర్చలు!

Guntur: గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియపై సిఐడి డిఎస్పి బషీర్‌తో అగ్రిగోల్డ్ అసోసియేషన్, సీపీఐ నాయకులు చర్చించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 10 Oct 2026 8:22 AM IST
Guntur
X

Guntur: అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై సిఐడి డిఎస్పితో చర్చలు!

Guntur: నేడు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్న నేపథ్యంలో, CID DSP బషీర్ ని కలిసి వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో అగ్రిగోల్డ్ బాధితుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏయే ప్రాంతాలకు సంబంధించి షెడ్యూల్‌ను ఎలా రూపొందించారు, బాధితులు వెరిఫికేషన్‌కు హాజరయ్యే సమయంలో ఎలాంటి పత్రాలను సమర్పించాలి, వెరిఫికేషన్ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు ఏమిటి అనే అంశాలపై చర్చించడం జరిగింది.

అలాగే, అగ్రిగోల్డ్ బాధితులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, వెరిఫికేషన్ కేంద్రాల వివరాలు, తేదీలు, అవసరమైన పత్రాల సమాచారం బాధితులకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాలని సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, CPI గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, అగ్రిగోల్డ్ యూనియన్ నాయకులు ప్రసాద్, సాంబశివరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం జరిగేలా, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా మరియు క్రమబద్ధంగా జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాము.

అగ్రిగోల్డ్ బాధితులందరికీ విజ్ఞప్తి: సంబంధిత అధికారులు ప్రకటించే షెడ్యూల్ ప్రకారం వెరిఫికేషన్ కేంద్రాలను సందర్శించి, సూచించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక ప్రకటనలను గమనిస్తూ, అందరూ సహకరించాలని కోరుతున్నాము.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN