Guntur: గిగ్ కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం!

Guntur: గుంటూరులో నిర్వహించిన గిగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో సీఐటీయూ నేత లక్ష్మీనారాయణ మాట్లాడారు. గిగ్ కార్మికుల సంక్షేమానికి ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 11 Oct 2026 11:37 PM IST
Guntur
X

Guntur: గిగ్ కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం!

గుంటూరు: గిగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో సిఐటియు కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాడుతూందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని సిఐటియు నగర కార్యాలయంలో గుంటూరు జిల్లా గిగ్ (2 వీలర్స్) వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జనరల్ బాడీ సమావేశం యునియన్ జిల్లా అధ్యక్షులు ఎస్.డి.వాహిద్ అధ్యక్షతన జరిగింది.

లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం గిగ్ ఎకానమీ నడుస్తున్నదని చెప్తూ ఆ గిగ్ కార్మికుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. లేబర్ కోడ్స్ లో గిగ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ, ఆయా ఫ్లాట్ ఫామ్స్ యజమానులు గిగ్ వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించడంలేదని, కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లను కార్మికులగా గుర్తించేలాగా ఆయా సంస్థల యజమానులపై ఒత్తిడి తేవాలని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా జరిగే పోరాటాలలో ర్యాపిడో వర్కర్స్ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు బి.ముత్యాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని, ఈ లేబర్ కోడ్స్ కార్మికులను బానిసలుగా మార్చే అవకాశం ఉందని అన్నారు.

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబరు 1, 2, 3 తేదీలలో ఢిల్లీలో ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఆ ధర్నాలో గిగ్ వర్కర్స్ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వివిధ ప్లాట్ ఫామ్స్ లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లందరిని ఐక్యం చేసి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని అన్నారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి యం. రాజేష్ కుమార్, కోశాధికారి యం.రత్నకుమార్, నాయకులు టి.తిరుపతిరావు, జానీబాషా, పిల్లి ఎలీషా, యం.హనుమంతరావు, ప్రభుకౌషిక్, అవినాష్, రవికిషోర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN